‘నాయకుడికి క్యారెక్టర్, క్రెడిబులిటీ ఉండాలి. సాయిరెడ్డికైనా, ఇంకెవరికైనా ఇదే వర్తిస్తుంది’ అంటూ వైసీపీ అధ్యక్షుడు జగన్ చేసిన వ్యాఖ్యలకు ఆ పార్టీ మాజీ నేత విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ‘నేను ప్రలోభాలకు లొంగలేదు. నాకు భయం లేదు’ అని ‘ఎక్స్’ వేదికగా స్పష్టం చేశారు. ‘‘వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్నవాడిని. అందుకే ఎవరికీ, ఎలాంటి ప్రలోభాలకీ లొంగలేదు. భయం అనేది నా అణువు అణువులోనూ లేదు. కాబట్టే రాజ్యసభ పదవి, పార్టీ పదవులు, రాజకీయాలనే వదులుకున్నా’’ అని తెలిపారు.