ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 44 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉండగా.. ఆప్ 26 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు వెలువడిన ఫలితాలను బట్టి.
ఆప్ కీలక నేతలు కేజ్రీవాల్, ఆతిశీ, మనీష్ సిసోడియా, సత్యేంద్ర కుమార్ జైన్, అవధ్ ఓజా, సౌరభ్ భరద్వాజ్ వెనుకంజలో ఉన్నారు. మరోపక్క ఆధిక్యాల్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్‌ను దాటి జోరు ప్రదర్శిస్తోంది. కాంగ్రెస్ ఏ స్థానంలోనూ ప్రభావం చూపలేకపోయింది.