కోనసీమ జిల్లాకు చెందిన మహిళ వీడియో అందరినీ కదిలిస్తోంది. వివరాల్లోకి వెళ్ళితే...... బతుకుదెరువునకు కువైట్ వెళ్లిన ఓ మహిళకు అగచాట్లు తప్పలేదు. తనను ఓ గదిలో బంధించి చిత్రహింసలు పెడుతున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. తన ఏజెంట్ తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని తెలిపింది. తనను కువైట్ తీసుకెళ్లిన ఏజెంట్ పెట్టే బాధలు భరించలేక స్వదేశానికి రప్పించేలా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ , మంత్రి నారా లోకేశ్ చర్యలు తీసుకోవాలని వేడుకుంటూ ఆ మహిళ వీడియో విడుదల చేసింది. కోనసీమ జిల్లా మండపేటకు చెందిన అమ్ములు ఆరు నెలల క్రితం ఓ ఏజెంట్ ద్వారా కువైట్‌కు వెళ్లింది.
అక్కడ ఇళ్లలో పని చేసేందుకు ఓ ఏజెంట్ బాధితురాలని నియమించాడు. అక్కడ ఇళ్లలో పరిమితికి మించి పనులు చెప్పడంతో బాధిత మహిళ ఆ పనులు చేయలేకపోయింది. పనిలో నుంచి తీసేసి రూ.2 లక్షలు కట్టే వరకు వదిలేది లేదని ఆ ఏజెంట్ గదిలో బంధించాడు. తన పరిస్థితిని వివరిస్తూ కాకినాడ జిల్లా ఉప్పాడలోని తన కోడలు దుర్గకు ఆ మహిళ వీడియో పంపించింది. ఈ వీడియో చూసిన వారు బంధుమిత్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత మహిళను స్వదేశానికి తీసుకు వచ్చేలా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.