ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సందర్భంగా బీజేపీ శ్రేణులు ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ మేరకు ప్రధాని మోదీకి.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఘన స్వాగతం పలికారు. ఈ విజయోత్సవ సభలో మోదీ మాట్లాడుతూ.. ఢిల్లీని అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటాం. ఢిల్లీ ప్రజల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.BJPపై విశ్వాసం ఉంచిన ప్రజలకు ప్రధాని మోదీ విజయోత్సవ సభలో ధన్యవాదాలు తెలిపారు. ఇకపై ఢిల్లీలో అభివృద్ధి పరుగులు పెడుతుందని అన్నారు. ఈ చరిత్రాత్మకమైన విజయం కోసం BJP కార్యకర్తలు, నేతలు రాత్రి పగళ్లు కష్టపడి శ్రమించారని వారి శ్రమ వృధాగా పోదని అన్నారు. ఆప్ నుంచి విముక్తి కలిగినందుకు ప్రజలు ఆనందంతో ఉన్నారని అన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్‌తో ఢిల్లీలో డబుల్ అభివృద్ధి చేస్తామని మోదీ హామీ ఇచ్చారు.
![]() |
![]() |