ఎలక్ట్రిక్ కార్ల ధరలు ఎంత ఎక్కువ ఉన్నాయో మీకు తెలుసు కదా? ప్రస్తుతానికైతే భారతదేశంలో అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారు ఏందంటే డౌట్ లేకుండా MG కామెట్ EV అని చెప్పొచ్చు.ఈ కారును మీరు వెంటనే బుక్ చేసుకుంటే కేవలం రూ. 50,000 డౌన్ పేమెంట్ చెల్లించి ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు. వివిధ వేరియంట్లు, రంగుల్లో లభించే కామెట్ EV ఫీచర్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం రండి.చైనీస్-బ్రిటిష్ వాహన బ్రాండ్ MG కంపెనీ కామెట్ EV భారతదేశంలో అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారు. ఇటీవల ఈ కంపెనీ ఎలక్ట్రిక్ కారు ధరలను పెంచింది. అయినప్పటికీ ఇప్పటికీ కామెట్ EV నే చౌకైన కారు. తక్కువ ధరకే ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటే ఇది మీకు మంచి అవకాశం. ఈ MG కారు ఆన్-రోడ్ ధర, EMI గురించి తెలుసుకుందాం.కామెట్ EV ఎలక్ట్రిక్ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ.7 లక్షల నుండి ప్రారంభమవుతుంది. టాప్ వేరియంట్ రూ.9.65 లక్షల వరకు ఉంటుంది.
మీరు గాని ఈ కారు కొనాలనుకుంటే కేవలం రూ.50,000 డౌన్ పేమెంట్ చెల్లించి ఇంటికి తీసుకెళ్లొచ్చు. దీని కోసం మీరు బ్యాంకు నుండి రూ.7 లక్షల లోన్ తీసుకోవాలి. 8 % వడ్డీ రేటుతో 4 సంవత్సరాల లోన్ తీసుకుంటే మీరు ప్రతి నెలా రూ.17,130 EMI చెల్లించాలి. మొత్తం 4 సంవత్సరాలలో బ్యాంకుకు రూ.8,22,240 చెల్లించాల్సి ఉంటుంది.వడ్డీ రేటు, డౌన్ పేమెంట్, లోన్ వ్యవధి మీ క్రెడిట్ స్కోర్, వివిధ బ్యాంకుల నిబంధనలను బట్టి మారవచ్చు. కాబట్టి లోన్ తీసుకునే ముందు బ్యాంకు రూల్స్ పూర్తిగా తెలుసుకోండి.
MG కామెట్ EV ఫీచర్లు
కామెట్ EV నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. అవి ఎగ్జిక్యూటివ్, ఎక్సైట్, ఎక్స్‌క్లూజివ్, 100వ వార్షికోత్సవ ఎడిషన్. దీని డిజైన్ Wuling Air EVని పోలి ఉంటుంది. MG కామెట్ EV GSEV ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. ఇది నగరాల్లో నివసించే వారికి చాలా బాగుంటుంది. అవసరాలకు తగ్గట్టుగా దీన్ని వాడుకోవచ్చు.145/70 టైర్ సైజుతో 12 అంగుళాల చక్రాలు ఉన్నాయి. ముందు భాగంలో డిస్క్ బ్రేక్‌లు, వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్‌లు లభిస్తాయి. కామెట్ EV పొడవు 2974 mm, వెడల్పు 1505 mm, ఎత్తు 1640 mm, వీల్‌బేస్ 2010 mm ఉంటుంది. టర్నింగ్ రేడియస్ కేవలం 4.2 మీటర్లు.
ఇది ట్రాఫిక్ రద్దీగా ఉండే రోడ్లలో డ్రైవింగ్ చేయడానికి సులువుగా ఉంటుంది. ఇరుకైన ప్రదేశాలలో కూడా పార్కింగ్ చేయవచ్చు. MG కామెట్ EV క్లోజ్డ్ ఫ్రంట్ గ్రిల్, ఫుల్ వెడల్పు LED స్ట్రిప్, స్లీక్ హెడ్‌ల్యాంప్‌ల వంటి ఫీచర్లను కలిగి ఉంది. పెద్ద డోర్లు, స్పోర్టీ అల్లాయ్ వీల్స్, ఫ్లాట్ రియర్ కూడా ఉన్నాయి.10.25 అంగుళాల స్క్రీన్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ క్లస్టర్ కూడా ఉన్నాయి. వివిధ ఫీచర్లను యాక్సెస్ చేయడానికి వినియోగదారులు తమ పరికరాలను కనెక్ట్ చేయవచ్చు. మ్యూజిక్, టర్న్-బై-టర్న్ నావిగేషన్, వాతావరణ సమాచారం, లైవ్ ట్రాఫిక్ అప్‌డేట్‌లను అందిస్తుంది. ఈ కారు నీలం, ఆకుపచ్చ, నారింజ, ఎరుపు రంగులలో లభిస్తుంది.
కామెట్ EV కారులో 17.3 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఈ కారు 42 bhp శక్తిని, 110 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనితో పాటు ఈ కారులో 3.3 kW చార్జర్ కూడా ఉంది. దీని సహాయంతో ఈ కారు ఐదు గంటల్లో 80 % వరకు ఛార్జ్ అవుతుంది. పూర్తిగా ఛార్జ్ కావడానికి దాదాపు ఏడు గంటలు పడుతుంది. అయితే 7.4 kW AC ఫాస్ట్ చార్జర్ సహాయంతో ఈ కారు కేవలం 2.5 గంటల్లో సున్నా నుండి 80% వరకు ఛార్జ్ అవుతుంది. ఈ కారు ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 230 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ పేర్కొంది.