ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకున్న భారత్.. సిరీస్ క్లీన్ స్వీప్‌పై కన్నేసింది. బుధవారం (ఫిబ్రవరి 12) జరగనున్న చివరి వన్డేతో ప్రయోగాలకు సిద్ధం అవుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్ ఆడే చివరి మ్యాచ్ ఇదే. దీంతో భారత జట్టు కూర్పుపై క్లారిటీ తెచ్చుకోవాలని మేనేజ్‌మెంట్ ఆలోచిస్తోంది. కానీ, ఈ సిరీస్‌లో ఇప్పటివరకు ఆడని వారికి కూడా అవకాశం ఇవ్వాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో మూడో వన్డే కోసం భారత జట్టులో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.
గుజరాత్‌లోని అహ్మదాబాద్ వేదికగా బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ సిరీస్‌లో ఇప్పటివరకు బెంచ్‌కే పరిమితమైన.. వికెట్ కీపర్ రిషభ్ పంత్, పేసర్ అర్ష్‌దీప్ సింగ్, ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌లకు ఈ మ్యాచ్ తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు ఉన్నాయి. తొలి వన్డేలో ఆడి.. రెండో వన్డే నుంచి విశ్రాంతి తీసుకున్న కుల్‌దీప్.. మూడో వన్డే బరిలోకి దిగే ఛాన్స్ ఉంది.
వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ ప్లేసులో రిషభ్ పంత్, మహమ్మద్ షమీ ప్లేసులో అర్షదీప్ సింగ్ తుది జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. తొలి 2 మ్యాచ్‌ల్లో సత్తా చాటిన ఆల్‌రౌండర్లు అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాకు రెస్ట్ ఇవ్వొచ్చు. వారి ప్లేసుల్లో మణికట్టు స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్, ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను తుది జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉంది. యంగ్ బ్యాటర్ యశస్వి జైశ్వాల్.. బెంచ్‌కే పరిమితం కానున్నట్లు తెలుస్తోంది.
ఇక రెండో వన్డేలో సెంచరీ చేసిన రోహిత్ శర్మ.. ఫామ్‌లోకి వచ్చాడు. ఇక ఇప్పుడు కోహ్లీ వంతు. అతడు కూడా ఫామ్‌లోకి వస్తే.. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది.
ఇంగ్లాండ్‌తో మూడో వన్డే కోసం భారత జట్టు (అంచనా):
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్‌దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.
![]() |
![]() |