ప్రతిష్ఠాత్మకమైన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు గడువు సమీపిస్తోంది. ఆస్ట్రేలియాలోనూ భారీ మార్పులు చేర్పులు చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆసీస్ క్యాంప్ కూడా గాయాల బారిన పడింది. కేప్టెన్ పాట్ కమ్మిన్స్ సహా కీలకమైన ముగ్గురు ప్లేయర్లు జట్టుకు దూరం అయ్యారు. ఆల్ రౌండర్ మార్కస్ స్టొయినిస్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించగా.. మిగిలిన ప్లేయర్లు గాయలబారిన పడ్డవాళ్లే. రెగ్యులర్ కేప్టెన్ పాట్ కమ్మిన్స్, స్టార్ పేస్ బౌలర్లు మిఛెల్ స్టార్క్, జోస్ హేజిల్‌వుడ్.. ఛాంపియన్స్ ట్రోఫీకి దూరం అయ్యారు. కమ్మిన్స్, హేజిల్‌వుడ్ ఇదివరకే జట్టు నుంచి తప్పుకోగా.. తాజాగా మిఛెల్ స్టార్క్ అదే బాట పట్టాడు. అతను ఛాంపియన్స్ ట్రోఫీ ఆడట్లేదని క్రికెట ఆస్ట్రేలియా అధికారికంగా ప్రకటించింది.
ఆస్ట్రేలియా జట్టు: స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), బెన్ డ్వార్‌షుయిస్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మార్నస్ లబుషేన్, గ్లెన్ మాక్స్‌వెల్, తన్వీర్ సంఘా, మాథ్యూ షార్ట్, ఆడమ్ జంపాకు చోటు దక్కింది. ట్రావెలింగ్ రిజర్వ్‌గా కూపర్ కొన్నోలీ ఉన్నాడు.
![]() |
![]() |