బర్డ్ ఫ్లూ (ఏవియన్ ఫ్లూ) అనేది పక్షులు, కొన్నిసార్లు నక్కలు, ఇతర జంతువుల్లో H5N1 వైరస్ వల్ల సంక్రమించే అంటువ్యాధి. ఇది 1990ల చివరలో చైనాలో ఉద్భవించింది.
చాలా అరుదైన సందర్భాల్లో ఈ వైరస్ మానవులకు సోకింది. మానవులకు ప్రస్తుతం ప్రమాదం తక్కువగా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వైరస్ సోకిన పక్షుల శ్వాసకోశ స్రావాలు, రక్తంతో వ్యాప్తి చెందుతుంది. 1997-2024 వరకు 957 మందికి సోకగా, 464 మంది మరణించారు.