ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ కంటే ముందే పాకిస్థాన్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్ల మధ్య ట్రై సిరీస్ నిర్వహించారు. పాకిస్థాన్ దేశంలోనే ఈ వన్డే సిరీస్ మూడు జట్ల మధ్య జరుగుతోంది. అయితే బుధవారం రోజున సౌతాఫ్రికా వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య ట్రై సిరీస్ లో భాగంగా వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ సందర్భంగా సౌతాఫ్రికా ప్లేయర్లతో రూడ్ గా బీహేవ్ చేశారు పాక్ ప్లేయర్లు. మొదటగా సఫారీ ప్లేయర్ మాథ్యూ బ్రీట్జ్కే తో గొడవ పెట్టుకున్నాడు పాకిస్థాన్ బౌలర్ షాహీన్ షా ఆఫ్రిది ఈ మ్యాచ్ 29 వ ఓవర్ లో ఈ సంఘటన జరిగింది. బ్యాటింగ్ చేస్తున్న సఫారీ ప్లేయర్ మాథ్యూ బ్రీట్జ్కే పైకి గొడవకు వెళ్లాడు అఫ్రీది. అలా రెండు సార్లు ఒకే ఓవర్ లో జరిగింది.
టెంబా బావుమాను ఔట్ చేసిన తర్వాత రెచ్చిపోయి సెలబ్రేషన్స్ చేసుకున్నారు పాకిస్థాన్ ప్లేయర్లు. ఇందులో సౌద్ షకీల్ మరియు కమ్రాన్ గులామ్ ఇద్దరూ ఉన్నారు. సౌద్ షకీల్, సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ కమ్రాన్ గులామ్ ఇద్దరూ… కూడా వికెట్ కోల్పోయిన టెంబా బావుమాను వెక్కిరించారు. పొట్టిగా ఉన్నాడంటూ గ్రౌండ్ లోనూ ర్యాగింగ్ చేశారు. దీంతో.. సౌద్ షకీల్, సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ కమ్రాన్ గులామ్ ల పైన ఫైన్ పడింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ముక్కోణపు సిరీస్ మ్యాచ్‌లో ఐసిసి ప్రవర్తనా నియమావళి లెవల్ 1ని ఉల్లంఘించినందుకు షాహీన్ షా ఆఫ్రిదిపై తన మ్యాచ్ ఫీజులో 25% జరిమానా విధించారు. అటు సౌద్ షకీల్, సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ కమ్రాన్ గులామ్ ల మ్యాచ్ ఫీజులో 10% జరిమానా విధించారు. కాగా ఈ మ్యాచ్ లో సఫారీలను చిత్తు చేసి ఫైనల్ కు వెళ్లింది పాకిస్థాన్. దీంతో రేపు న్యూజిలాండ్ వర్సెస్ పాక్ మధ్య ఫైనల్ మ్యాచ్ ఉంటుంది.
#Pakistan #PAKvsSA pic.twitter.com/l0EFiD8GP1
— Faizan Naseer Faizi (@Faizan_Naser_K9) February 12, 2025
![]() |
![]() |