"నేనేమీ రాజును కాదు. దయచేసి నన్ను కింగ్ అని పిలవొద్దు. ఒకప్పుడిలా నేను ఇప్పుడు నాపై చాలా బాధ్యతలు ఉన్నాయి. నా పరుగులు, రికార్డులు అవన్నీ గతమే. ప్రస్తుతం ప్రతీ మ్యాచ్ నాకు సవాలే. భవిష్యత్‌పై కూడా నేను దృష్టి పెట్టాలి. జట్టు అవసరాలను బట్టి నేను కూడా ఆడాలి. ఇంకెవరూ తనను కింగ్ అని పిలవొద్దు" అంటూ మీడియాకు, ఫ్యాన్స్‌కు బాబర్ ఆజామ్ రిక్వెస్ట్ చేశాడు.
వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్ బాబర్ ఆజామ్ ఫ్యాన్స్‌కి ఒక రిక్వెస్ట్ చేశాడు. ఇకపై నన్ను కింగ్ అని పిలవొద్దని కోరాడు. గత కొంతకాలంగా బాబర్ విఫలమవుతుండటమే ఇందుకు కారణం. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు జరుగుతున్న ట్రై సిరీస్‌లో విఫలమవడమే ఇందుకు కారణం.
పాకిస్తాన్ వేదికగా న్యూజిలాండ్, సౌతాఫ్రికా, పాకిస్తాన్ మధ్య వన్డే ట్రై సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్‌లో ఒక మ్యాచ్‌లో ఓడి, మరో మ్యాచ్‌లో గెలిచిన పాకిస్తాన్ జట్టు ఫైనల్స్‌కు చేరింది. మొదటి రెండు మ్యాచ్‌లలోనూ బాబర్ ఆజామ్ చెప్పుకోదగ్గ పరుగులు చేయలేదు. మూడో మ్యాచ్‌లో కూడా కేవలం 29 పరుగులకే వికెట్ చేజార్చుకున్నాడు. లాహోర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పది పరుగులకే అవుటైన బాబర్.. కరాచీ వేదికగా సఫారీలతో జరిగిన మ్యాచ్‌లో 23 పరుగులు చేశాడు.
"నేనేమీ రాజును కాదు. దయచేసి నన్ను కింగ్ అని పిలవొద్దు. ఒకప్పుడిలా నేను ఇప్పుడు నాపై చాలా బాధ్యతలు ఉన్నాయి. నా పరుగులు, రికార్డులు అవన్నీ గతమే. ప్రస్తుతం ప్రతీ మ్యాచ్ నాకు సవాలే. భవిష్యత్‌పై కూడా నేను దృష్టి పెట్టాలి. జట్టు అవసరాలను బట్టి నేను కూడా ఆడాలి. ఇంకెవరూ తనను కింగ్ అని పిలవొద్దు" అంటూ మీడియాకు, ఫ్యాన్స్‌కు బాబర్ ఆజామ్ రిక్వెస్ట్ చేశాడు.
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఒక్క బాబర్ మినహా పాకిస్తాన్ కీలక ఆటగాళ్లంతా ఫామ్‌లోకి వచ్చారు. పాక్ కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్, సల్మాన్ అఘా సెంచరీలతో కదం తొక్కగా.. షాహీన్ అఫ్రిది బంతితో చెలరేగుతున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగే ఫైనల్ మ్యాచ్‌లో అయినా బాబర్ ఫామ్‌లోకి వస్తాడని చూసిన అతని ఫ్యాన్స్‌కి మళ్లీ నిరాశే ఎదురైంది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో ఎలా రాణిస్తాడో వేచి చూడాలి.
![]() |
![]() |