సోనూసూద్ గొప్ప నటుడే కాకుండా మనసున్న రియల్ హీరో అని మంత్రి గుమ్మిడి సంధ్యారా ణి అన్నారు. సాలూరులోని తన నివాసంలో ఆమె శుక్రవారం స్థానిక విలేకర్లతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ..... గిరిజనుల కోసం సోనూసూద్ ముఖ్యమంత్రికి నాలుగు అంబులెన్స్‌లు అందించారని చెప్పారు. ఆయనకు అరకు పార్లమెంట్ గిరిజనులందరి తరపున ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లాకు రెండు, పార్వతీ పురం మన్యం జిల్లాకు రెండు అంబులెన్స్‌లను పంపించారన్నారు. కరోనా సమయంలో వివిధ ప్రదేశాల్లో చిక్కుకున్న వారిని తన సొంత ఖర్చులతో వారివారి స్వగ్రామాలకు పంపిన గొప్ప మనుసున్న హీరో సోనూసూద్ అని ఆమె అన్నారు.
![]() |
![]() |