రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ జెయింట్స్ మధ్య జరిగిన ప్రారంభ మ్యాచ్‌లో సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిసింది. అయితే చివరకు విజయం బెంగళూరు జట్టు నే వరించింది. టోర్నమెంట్ మొదటి మ్యాచ్‌లోనే మహిళల ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యధిక స్కోరును ఛేదించడం ద్వారా బెంగళూరు జట్టు సంచలనం సృష్టించింది. 202 పరుగుల చారిత్రాత్మక ఛేదనలో ఎల్లీస్ పెర్రీ, రిచా ఘోష్ , కనికా అహుజా కీలక పాత్రలు పోషించారు. ఈ ముగ్గురు బ్యాటర్ల దూకుడుతో ఆర్‌సిబి 202 పరుగుల లక్ష్యాన్ని ఇంకా 9 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. గత 2 సీజన్లలో ఇంత పెద్ద స్కోరును ఎప్పుడూ ఏ జట్టు ఛేజ్ చేయలేదు. శుక్రవారం (ఫిబ్రవరి 14వ తేదీ) గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ స్మృతి మంధాన టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో గుజరాత్ జట్టు కెప్టెన్ ఆష్లే గార్డనర్ తుఫాను ఇన్నింగ్స్ సహాయంతో 201 పరుగులు చేసింది. ఆ తర్వాత ఈ భారీ స్కోరును ఛేదించే క్రమంలో ఆర్‌సిబి కేవలం 14 పరుగులకే తమ ఓపెనర్లిద్దరి వికెట్లను కోల్పోయింది. కానీ దీని తర్వాత ఎల్లీస్ పెర్రీ క్రీజులోకి వచ్చింది. తన పవర్ ఫుల్ హిట్టింగ్ తో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించింది.
మూఢత బాటింగ్ చేసిన గుజరాత్ వికెట్ కీపర్ ముని 56 పరుగులతో దుమ్ము లేపింది. 42 బంతుల్లోనే 56 పరుగులు చేసి రాణించింది. ఆ తర్వాత.. వచ్చిన గుజరాత్ కెప్టెన్ గార్డినర్ 79 పరుగులతో రాణించారు. 37 బంతుల్లోనే మూడు బౌండరీలు అలాగే 8 సిక్సర్లు బాదిన గార్డినర్ 79 పరుగులు చేసింది. చివర్లో దీనేంద్ర 25 పరుగులతో రాణించింది. అయినా గుజరాత్ లక్ష్యాన్ని బెంగళూర్ సునాయాసంగా 18.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేదించి ఘానా విజయాన్ని అందుకుంది.
Here are the winners of the #CurvvSuperStriker of the Match, #SintexSixesoftheMatch and #HerbalifeActiveCatchOfTheMatch awards @TataMotors_Cars | @Sintex_BAPL_Ltd | #SintexTanks | @Herbalife pic.twitter.com/T6PPB0fLRB
— Women's Premier League (WPL) (@wplt20) February 14, 2025
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa