గుండ్లకమ్మ ప్రాజెక్ట్ పరిధిలోని పునరావాసకాలనీల్లో నెలకొన్న సమస్యలను వేగంగా పరిష్కరించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. త్వరలో గుండ్లకమ్మ గేట్లకు నిధులు విడుదల అవుతాయని చెప్పారు. శుక్రవారం కొరిశపాడు మండలంలోని యర్రబాలెంలో అద్దంకి నియోజకవర్గంలోని ఏడు పునరావాస గ్రామాల ప్రజల సమస్యల గురించి అధికారులతో సమీక్షించారు. తొలుత యర్రబాలెంలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన సిమెంట్ రోడ్లను ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన సమీక్షంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో 64 లక్షల మంది పింఛన్‌దారులకు ఏటా 33 వేల కోట్ల రూపాయలు ఇస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదేనని చెప్పారు. గుండ్లకమ్మ పునరావాసకాలనీలో పనులను నాణ్యతతో చేపట్టాలని ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న దేవాలయాలను, రోడ్లను వెంటనే పూర్తి చేయాలన్నారు.
యర్రబాలెం పునరావాసకాలనీ నుంచి జాతీయ రహదారి వరకు రోడ్డును, తిమ్మనపాలెం నుంచి యర్రబాలెం వరకు వచ్చే రోడ్డును వెంటనే పూర్తి చేయాలని చెప్పారు. యర్రబాలెంలో గతంలో నిర్మించిన సిమెంట్‌రోడ్లు అన్ని పగుళ్లు ఇచ్చాయని, వాటిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గత వైసీపీ ప్రభుత్వం గుండ్లకమ్మ ప్రాజెక్టునే కాదు నిర్వాసితులనూ ముంచిందని మండిపడ్డారు. జగన్ మోహన్ రెడ్డి ఆర్థిక అరాచకంతో రాష్ట్రం ఎంతో వెనుకబడిపోయిందన్నారు. ఈ పరిస్థితి నుంచి కోలుకోవాలంటే సమయం పడుతుందని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడితే కొత్త పింఛన్లు ఇవ్వడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ పునరావాసకాలనీలలో చేసే పనులలో నాణ్యత పాటించని కాంట్రాక్టర్‌లను బ్లాక్ లిస్టులో పెట్టడంతో పాటు బిల్లులు ఆపేయాలని చెప్పారు. అలాగే పనులు చేయించిన అధికారులపైనా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమీక్షలో ఆర్డీవో తూమాటి చంద్రశేఖర్ నాయుడు, ఎస్‌డీసీ జ్యోతి, విద్యుత్ శాఖ ఈఈ నల్లూరి మస్తాన్‌రావు, గుండ్లక మ్మ ప్రాజెక్టు ఈఈ శ్రీహరి, డీఈఈ కరిముల్లా, ఇరిగేషన్ ఈఈ ఎం. రవి, ఆర్‌డౠ్ల్యఎస్ డీఈ శ్రీనివాసరావు, హౌసింగ్ డీఈ ఖాదర్ వలి, తహసీల్దార్ జీవీ సుబ్బారెడ్డి, ఎంపీడీవో రాజ్యలక్ష్మి, ఎంపీపీ సాదినేని ప్రసన్నకుమార్, సర్పంచ్ నాగరాజు, ిపీఆర్ ఏఈ ప్రసాద్, పునరావాసకాలనీ ప్రజలు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
![]() |
![]() |