బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి షాక్ కొడుతోంది. ఎందుకంటే గోల్డ్ రేటు ఆల్ టైమ్ రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది. దీని వల్ల ఇప్పుడు బంగారం కొందామంటే చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో పసిడి ప్రియులకు ఒక గుడ్ న్యూస్. ఏంటని అనుకుంటున్నారా.. బంగారం ధరలు దిగి రానున్నాయి. పసిడి రేటు రానున్న రోజుల్లో తగ్గొచ్చనే అంచనాలు నెలకున్నాయి. దీనికి పలు కారణాలు ఉన్నాయి. అవేంటో మనం ఒకసారి తెలుసుకుందాం.మన దేశంలో బంగారం ధరలు ప్రధానంగా విదేశీ మార్కెట్‌లోని రేట్లపై ఆధారపడి మారుతూ ఉంటాయి. అందుకే గ్లోబల్‌గా బంగారం ధరలు మారితే ఆ ప్రభావం మన దేశంలోని ప్రధాన నగరాల్లోని గోల్డ్ రేట్లపై కూడా ఉంటుంది.ఈ క్రమంలో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గాయి. ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ ధర ఔన్స్‌కు 2900 డాలర్లకు దిగి వచ్చింది. దాదాపు 1.52 శాతం మేర క్షీణించింది. దీని వల్ల మన దేశంలో కూడా బంగారం ధరలపై ప్రతికూల ప్రభావం పడొచ్చు.మన దేశంలో చూస్తే.. ఎంసీఎక్స్ మార్కెట్‌లో బంగారం ధర నిన్న నిలకడగానే ఉంది. ట్రేడింగ్ ఆరంభంలో బంగారం ధర రూ. 86,020 వద్ద ప్రారంభం అయ్యింది. కానీ తర్వాత ఆ స్థాయిలోనే కొనసాగలేకపోయింది. ప్రాఫిట్ బుకింగ్ కారణంగా రూ. 84,710కు తగ్గింది.అంతేకాకుండా అమెరికాలో రిటైల్ సేల్స్ గణాంకాలు కూడా అంచనాల కన్నా బలహీనంగా నమోదు అయ్యాయి. దీని వల్ల కూడా బంగారంపై ఒత్తిడి నెలకుందని నిపుణులు పేర్కొంటున్నారు.ఇంకా టెక్నికల్ చార్ట్స్ ప్రకారం చూస్తే.. బంగారం ధరలో బేరిష్ సిగ్నల్స్ కారణంగా రివర్సల్ ట్రెండ్ ఉండొచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.గురువారం రోజున బంగారం ధర 2940 స్థాయికి చేరిందని, అయితే అక్కడి నుంచి సెల్లార్లు వెనకడుగు వేశారని తెలిపారు. తర్వాత పసిడి రేటు 2879 స్థాయిలో కదలాడిందని పేర్కొన్నారు. ఇది మద్దుతు స్థాయిగా కూడా ఉందని తెలిపారు.బంగారం ధర ఈ స్థాయి కిందకు వస్తే.. తర్వాత పసిడి రేటు మరింత దిగి వచ్చే అవకాశం ఉందని వివరించారు. వీక్లీ చార్ట్‌లో చూసినా కూడా.. బేరిష్ ట్రెండ్ ఉందని తెలిపారు. 2817 స్థాయికి పడిపోవచ్చని అంచనా వేశారు. బంగారానికి ఇది 20 రోజుల మూవింగ్ యావరేజ్. అయితే ఇక్కడి నుంచి పసిడి రేటు పైకి చేరొచ్చనే అంచనాలు కూడా ఉన్నాయి.ఇకపోతే మన తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర ప్రస్తుతం 24 క్యారెట్లకు చూస్తే.. రూ. 87,170 వద్ద కొనసాగుతోంది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు విషయానికి వస్తే.. ఈ పసిడి రేటు రూ. 79,910 వద్ద ఉంది. ఫిబ్రవరి 15 సాయంత్రం వరకు ఈ రేట్లు ఉంటాయి. పది గ్రాములకు రేట్లు వర్తిస్తాయి.
![]() |
![]() |