రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన ఆసుపత్రుల్లో డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి సత్యకుమార్ తెలిపారు. పాలకొల్లు ప్రభుత్వాసుపత్రిలో రూ.కోటితో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాన్ని శుక్రవారం మరో మంత్రి నిమ్మల రామానాయుడితో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘రాష్ట్రవ్యాప్తంగా క్యాన్సర్, డయాబెటిస్, బీపీ, కిడ్నీ పనిచేయక పోవడం వంటి ఆరోగ్య సమస్యలు ఉన్న వారి వివరాలను తెలుసుకునేందుకు సర్వే చేపట్టాం. దీనిఆధారంగా వారిఆరోగ్య సంరక్షణకు చర్య లు తీసుకుంటాం. ఇప్పటికే గుండెపోటు నివారణకు పీహెచ్సీల్లో ఉచితంగా ఇంజక్షన్లను అందుబాటులోకి తెచ్చాం. రెండేళ్లలో పాలకొల్లులోని మెడికల్ కాలేజ్ నిర్మాణం పూర్తి చేస్తాం’ అని తెలిపారు. కాగా, ప్రపంచ స్థాయి నగరంగా రాజధాని అమరావతి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు. సీఆర్డీఏ సమావేశంలో రూ.37,702 కోట్లు విలువ చేసే 59 అభివృద్ధి పనుల టెండర్లకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు.
![]() |
![]() |