ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీఈఏపీసెట్)-2025కు శనివారం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు జేఎన్టీయూకే ఉప కులపతి, ఏపీఈఏపీసెట్ చైర్మన్ సీఎ్‌సఆర్కే ప్రసాద్ తెలిపారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 12న విడుదల చేశారన్నారు. ఎటువంటి అపరాధ రుసుము లేకుండా ఏప్రిల్ 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, మే 19 నుంచి 27 వరకు ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రంలో 46, తెలంగాణలోని హైదరాబాద్‌లో 2... మొత్తం 48 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. జ్ట్టిఞట://ఛ్ఛ్టిట.్చఞటఛిజ్ఛి.్చఞ.జౌఠి.జీుఽ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు పూరించాలని సూచించారు. మే 19 నుంచి 20 వరకు అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు రోజుకు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తామని, ఇంజనీరింగ్ విభాగంలో మే 21 నుంచి 27 వరకు పరీక్షలు జరుగుతాయని ఏపీఈఏపీసెట్ కన్వీనర్ వీవీ సుబ్బారావు తెలిపారు. మే 24న పరీక్ష ఒక సెషన్‌లో మాత్రమే ఉంటుందని, 25న పరీక్ష ఉండదన్నారు. పరీక్షలు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు జరుగుతాయని చెప్పారు.
![]() |
![]() |