మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి 6వ వర్ధంతి సందర్భంగా కుమార్తె వైఎస్ సునీతా రెడ్డి నివాళులర్పించారు. పులివెందుల్లోని సమాధుల తోటలో తండ్రి సమాధికి పూలమాల వేసి సునీత, కుటుంబసభ్యులు నిబవాళులర్పించారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ...మా తండ్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య జరిగి ఆరు సంవత్సరాలు అయ్యిందన్నారు. న్యాయం కోసం ఆరు సంవత్స రాలుగా పోరాడుతున్నట్లు తెలిపారు. హత్య కేసులో ఒక్కరు తప్ప మిగిలిన అందరూ బయట యధేచ్చగా తిరుగుతున్నా రని మండిపడ్డారు. విచారణ జరగట్లేదు ట్రైల్స్ నడవట్లేదు న్యాయం జరుగుతుందా అని ప్రశ్నించారు. హత్య గురించి ఎంత పోరాడినా న్యాయం జరగట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో నిందితుల కంటే తమకు , తమ కుటుంబానికే ఎక్కువ శిక్ష పడుతున్నట్లు అనిపిస్తోందన్నారు. సీబీఐ వారు మళ్ళీ విచారణ ప్రారంభించాలని భావిస్తున్నానన్నారు. సాక్షులను, నిందితులను కాపాడే బాధ్యత స్టేట్ గవర్నమెంట్ తీసుకోవాలని కోరారు. సాక్షులపై ఒత్తిడి తీసుకొని వస్తున్నారన్నారు. సాక్షుల మరణాలపై కూడా తమకు అనుమానం ఉందన్నారు. న్యాయం జరిగేంత వరకు పోరాడుతూనే ఉంటానని వైఎస్ సునీత రెడ్డి స్పష్టం చేశారు. వివేకా వర్ధంతి కార్యక్రమంలో వైఎస్ సునీతతో పాటు అల్లుడు రాజశేఖర్రెడ్డి, వైఎస్ ప్రకాష్ రెడ్డి, ఇతర కుటుంబసభ్యులు పాల్గొని.. వివేకాకు నివాళులర్పించారు.
![]() |
![]() |