పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకులో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఇవాళ(శనివారం) పర్యటించనున్నారు. ఉదయం ఎనిమిది గంటలకు హెలికాఫ్టర్‌లో ఉండవల్లి నుంచి తణుకు రానున్నారు. హెలిప్యాడ్ వద్ద అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం అవుతారు. అనంతరం 8.40 గంటలకు ఎన్టీఆర్ పార్క్‌కు సీఎం చంద్రబాబు చేరుకోనున్నారు. పారిశుద్ధ్య కార్మికులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం స్వచ్ఛ్ దివస్ కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత 50 మంది పారిశుద్ధ్య కార్మికులతో ఫొటో సెషన్ ఉంటుంది. అనంతరం జిల్లా పరిషత్ బాలుర పాఠశాలకు చేరుకుంటారు. ప్రజావేదికపై నుంచి సీఎం చంద్రబాబు ప్రసంగిస్తారు. పారిశుధ్య కార్మికులను సీఎం చంద్రబాబు సత్కరిస్తారు. 10.15 గంటలకు పార్టీ కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులతో జరిగే సమావేశానికి హాజరవుతారు. 11.15 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం అవుతారు. మధ్యాహ్నం12 గంటల 10 నిమిషాలకు తణుకు నుంచి బయలుదేరి ఉండవల్లి నివాసానికి సీఎం చంద్రబాబు చేరుకుంటారు.
![]() |
![]() |