వలంటీర్లు ఎవ్వరూ లేరు, రెన్యూవల్ చెయ్యలేదని చెప్పిన మంత్రి బాల వీరంజనేయ స్వామి చేసిన ప్రకటనపై శాసన మండలిలో వైయస్ఆర్సీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం వాలంటీర్ల తొలగింపుపై మండలిలో తీవ్ర చర్చ జరిగింది. ఈ సందర్భంగా వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మాట్లాడుతూ..ఎన్నికలకు ముందు వాలంటీర్ల వేతనాన్ని 10వేలకి పెంచుతామని హామీ ఇచ్చి ..అధికారంలోకి వచ్చాక 2,56,000 మంది వాలంటీర్లను తొలగించారని మండిపడ్డారు. ఇవాళ వలంటీర్ వ్యవస్థనే లేదని మంత్రి చెప్పడం వలంటీర్లను మోసం చేయడమే అన్నారు. 2024 సెప్టెంబర్లో వరదలు వచ్చినప్పుడు వలంటీర్లతో ఎలా డ్యూటీ చేయించారని నిలదీశారు. నవంబర్ 2024 వరకు వాళ్లకి ఐడీలు ఎలా కొనసాగించారని ప్రశ్నించారు.
![]() |
![]() |