ప్రైవేటు యూనివర్శిటీస్ యాక్ట్‌ను సవరించాల్సి ఉందని, దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని లోకేశ్ చెప్పారు. ప్రస్తుత చట్టం యూజీసీ రెగ్యులైజేషన్స్కు విరుద్ధంగా ఉందన్నారు. దీనివల్ల మనకు ప్రైవేటు యూనివర్శిటీలు రావడం లేదన్నారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు యూనిఫైడ్ యాక్ట్ తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. టోని బ్లెయిర్ ఇన్స్స్టిట్యూట్తో కలిసి గుడ్ గవర్నెన్స్ కోసం ప్రపంచస్థాయి శిక్షణ సంస్థను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉందన్నారు. ఏఐ హ్యూమనాయిడ్స్, డీప్ టెక్‌పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. అమరావతిలో డీప్ టెక్ సంస్థను నెలకొల్పాల్సిన అవసరం ఉందన్నారు. విశాఖలో ఏఐ యూనివర్శిటీని నెలకొల్పుతామన్నారు.
![]() |
![]() |