సొంతింటి కళను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నెరవేర్చుతాడని జమ్మలమడుగు టీడీపీ ఇన్‌చార్జి భూపేశ్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం జమ్మలమడుగు టీడీపీ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు సంబంధించిన కార్యకర్తలు, ఇతరులతో ఆయన సమావేశమై మాట్లాడారు. 2019-24 సంవత్సరంలో ఇళ్లకు సంబంధించి ఎస్టీలకు రూ.75 వేలు, ఎస్సీ, బీసీ కులాలకు రూ.50 వేలు, ప్రభుత్వం ఆర్థికసాయం అందిస్తోందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఐఎల్ చిన్న, పొన్నతోట మల్లి, బిర్రు సంతోష్ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa