స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ అమలుతో ఏపీ అన్ని రంగాల్లో స్వయం సమృద్ధి సాధిస్తుందని బీజేపీ ఎమ్మెల్యే ఎన్.ఈశ్వరరావు అన్నారు. విజన్ డాక్యుమెంట్‌పై పాఠశాల లు, కాలేజీల విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. ‘ఆశతో ఉన్న వారికి అధికారమిస్తే జగన్ లాగా దోచుకుంటారు. ఆశయంతో ఉన్న వారికి అధికారమిస్తే చంద్రబాబులా అభివృద్ధికి బాటలు వేస్తారు’ అని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అన్నారు. అభివృద్ధికి కొత్త దారులు సృష్టిస్తున్న ప్రస్తుత ప్రభుత్వం పీ4 విధానంలో ప్రతి జిల్లాలో ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీని నెలకొల్పాలని కోరారు. గతంలో విజన్-2020ని రూపొందించినప్పుడు వెటకారంగా మాట్లాడారని, అప్పట్లో హైదరాబాదులో రూ.2 లక్షలు పలికిన ఎకరం భూమి ఇప్పుడు రూ.50 కోట్లు.. 100 కోట్లు కూడా పలుకుతోందని చెప్పారు. ఈ మార్పునకు చంద్రబాబు విజనే కారణమని చెప్పారు.
![]() |
![]() |