ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఓఆర్ఆర్ (ఔటర్ రింగ్ రోడ్డు) కు సంబంధించి అప్డేట్ వచ్చింది. అమరావతి ఓఆర్ఆర్ అలైన్‌మెంట్ మార్చాలని జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్)కు కేంద్ర ఉపరితల రవాణా శాఖ సూచించింది. ఇటీవల నిర్వహించిన డ్రోన్ సర్వేలో ప్రస్తుత అలైన్‌మెంట్‌కు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని గుర్తించారు. ఈ మేరకు ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో తెనాలి, పేరేచర్ల దగ్గర నాలుగు చోట్ల మార్పులు చేయాలని సూచించారు. నాలుగు ప్రాంతాల్లో ఇబ్బందుల కారణంగా 43 కిలోమీటర్ల మేర అమరావతి ఓఆర్‌ఆర్ అలైన్‌మెంట్‌ను మార్చాల్సి వస్తోంది. దీంతో నేషనల్ హైవే అథారిటీ అమరావతి డివిజన్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారు.
అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు 150 మీటర్ల వెడల్పుకు అనుకూలంగా అనుమతి ఇవ్వాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి రాసిన లేఖలో 150మీటర్లకు అనుమతి ఇవ్వాలని కోరారు. అయితే బెంగళూరు ఓఆర్‌ఆర్‌కు గరిష్ఠంగా 70 మీటర్ల వరకే అనుమతి ఇచ్చామని అమరావతి ఓఆర్ఆర్‌కు కూడా అంతవరకే అనుమతి స్తామని చెబుతున్నట్లు సమాచారం. ఈ అంశంపై ఫైనల్‌గా నిర్ణయం తీసుకునే వరకు అలైన్‌మెంట్ ఖరారయ్యే అవకాశం లేదంటున్నారు.
అయితే 70 మీటర్ల వెడల్పు రోడ్డుకు 8 లైన్లకు అనుగణంగా భూ సేకరణ చేయాల్సి ఉంటుంది.
ఒకవేళ ఓఆర్ఆర్ వెడలప్పు 100, 150 మీటర్లకు పెరిగితే.. ఏఖంగా 14, 18 లైన్లకు తగిన విధంగా భూసేకరణకు అలైన్‌మెంట్‌ను ఖాయం చేయాలి. ఓఆర్‌ఆర్ వెడల్పు పెరిగే కొద్ది భూసేకరణ కూడా పెరిగే అవకాశం ఉ:టుంది.. అందుకే ఈ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. అమరావతి ఓఆర్ఆర్‌కు సంబంధించి కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పల్నాడు, గుంటూరు జిల్లాల పరిధిలో భూ సేకరణ కోసం ప్రభుత్వం జేసీలను నియమించిన సంగతి తెలిసిందే. ఓఆర్ఓఆర్ ఎన్ని మీటర్ల వెడల్పు తెలియగానే భూసేకరణ ప్రక్రియను ప్రారంభించననున్నారు.
అమరావతతి ఓఆర్‌ఆర్ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టు కావడంతో పర్యావరణ అనుమతులు కచ్చితంగా తీసుకోవాల్సిందే. అలైన్‌మెంట్ నిర్ధారించిన తర్వాత పర్యావరణ అనుమతుల కోసం ఐదు జిల్లాల పరిధిలో అనుమతుల కోసం ఎన్‌హెచ్ అధికారులు దరఖాస్తు చేస్తారు. ఓఆర్‌ఆర్ నిర్మాణం కారణంతో పర్యావరణానికి ఎలాంటి విఘాతం కలుగుతుందే తెలుసుకునేందుకు సర్వే కూడా నిర్వహిస్తారు. అనంతరం ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించిన తర్వాత పర్యావరణశాఖ అనుమతులు ఇస్తుంది. ఓఆర్‌ఆర్ వచ్చే మార్గంలో అటవీ భూములు ఉండటంతో.. ఈ అటవీ భూముల డీనోటిఫై కోసం కేంద్ర అటవీ శాఖకు ప్రతిపాదనలు పంపాల్సి ఉంటుంది. మొత్తం మీద అమరావతి ఓఆర్‌ఆర్ పనులపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.
![]() |
![]() |