గుజరాత్‌లోని కచ్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. 15 ఏళ్ల బాలిక ఉరేసుకొని సూసైడ్ చేసుకుంది. జామ్ నగర్‌లోని హపాలో దీక్షిత్ సోయగామ పదో తరగతి చదువుతుంది. అయితే పాఠశాలకు ఫోన్ తెచ్చుకోవడంతో బాలికను టీచర్ మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన బాలిక ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ జరుపుతున్నారు.
![]() |
![]() |