యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) జాతీయ విమానయాన సంస్థ ఎతిహాద్ ఎయిర్‌వేస్ భారతీయుల కోసం బంపరాఫర్ ప్రకటించింది. ఈ వేసవిలో తమ సంస్థ విమానాల్లో ప్రయాణించే భారతీయ ప్రయాణికులకు 30 శాతం ప్రత్యేక డిస్కౌంట్ ఇస్తున్నట్లు ప్రకటించింది. టర్కీ, గ్రీస్, స్పెయిన్, ఫ్రాన్స్, వార్సా, ప్రాగ్ రూట్లలో ప్రయాణించే వారికి ఈ ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్ వర్తిస్తుంది. మార్చి 28 వరకు తగ్గింపు ఛార్జీలతో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఇలా టికెట్ బుక్ చేసుకున్నవారు ఈ ఏడాది మే 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్య ప్రయాణించవచ్చని పత్రికా ప్రకటనలో ఎతిహాద్ ఎయిర్‌వేస్ పేర్కొంది.
![]() |
![]() |