ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు ఇండియన్ ప్రీయర్ లీగ్ కౌన్సిల్ భారీ షాక్ ఇచ్చింది. నిన్న గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఆయనకు ఫైన్ విధించింది. పాండ్యాకు ఏకంగా రూ. 12 లక్షల ఫైన్ వేసింది. ఐపీఎల్ నియమావళిలోని ఆర్టికల్ 2.2 ప్రకారం ఈ జరిమానా విధించింది. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.గత సీజన్ లో కూడా హార్దిక్ ఇలాగే వరుస జరిమానాలకు గురయ్యాడు. ఆయనకు ఐపీఎల్ కౌన్సిల్ ఒక మ్యాచ్ నిషేధం కూడా విధించింది. ఈ కారణంగానే ఈ సీజన్ లో ముంబై తరపున హార్దిక్ తొలి మ్యాచ్ ఆడలేదు. నిన్నటి మ్యాచ్ లో ఓటమి బాధలో ఉన్న హార్దిక్ కు ఐపీఎల్ కౌన్సిల్ మరో షాక్ ఇచ్చినట్టయింది.
![]() |
![]() |