మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్ గఢ్ లో 50 మంది మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయారు. బీజాపూర్ జిల్లా ఎస్పీ సమక్షంలో వీరు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో 10 మంది మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారు. వీరిలో 14 మంది తలలపై రూ. 68 లక్షల రివార్డు ఉంది.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ 50 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా లొంగిపోయారని తెలిపారు. వీరి లొంగుబాటులో సీఆర్పీఎఫ్, ఎస్టీఎఫ్, డీఆర్జీ కీలక పాత్ర పోషించాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పునరావాస చర్యల్లో భాగంగా వీరిలో ఒక్కొక్కరికి రూ. 25 వేల చెక్ లను అందించామని తెలిపారు. వీరు జనజీవన స్రవంతిలో కలిసేందుకు పునరావాసం కల్పిస్తామని చెప్పారు
![]() |
![]() |