బేతంచెర్ల మండలం సంకలాపురం గ్రామంలోని శ్రీరామచంద్ర స్వామి దేవాలయానికి గురువారం డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ కిరీటాలను సమర్పించారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే, దేవాలయ అభివృద్ధికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. భక్తుల ఆకాంక్షలను నెరవేర్చే భాగంగా స్వామివారికి కిరీటాలను సమర్పించడం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు.
![]() |
![]() |