ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన జాతీయ అవార్డులు, పాలిటిక్స్ పై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఇందులో భాగంగా పవన్ గురించి కూడా మాట్లాడారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సమయంలో ప్రజా సమస్యల గురించి మాట్లాడిన పవన్ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక వాటి గురించి పెద్దగా పట్టించుకోవడం లేదనే భావనను ఈ సందర్భంగా ప్రకాశ్‌రాజ్ వ్యక్తం చేశారు. అధికారంలో ఉండి కూడా ప్రజా సమస్యలను పరిష్కరించకుండా టైంపాస్ పనులేంటి అని నిలదీశారు. రకరకాలుగా మాట్లాడటానికి ఇదేం సినిమా కాదన్నారు. కాగా, గతంలోనూ పవన్‌ను ఉద్దేశించి ప్రకాశ్‌రాజ్ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టిన విషయం తెలిసిందే. ఇక తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ వివాదంపై మాట్లాడిన ప్రకాశ్‌రాజ్ ఇది చాలా సున్నితమైన అంశంగా పేర్కొన్నారు. ఇలాంటి వాటి గురించి మాట్లాడేటప్పుడు సరైన ఆధారాలతో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ఒకవేళ నిజంగా లడ్డూ తయారీలో కల్తీ జరిగి ఉంటే బాధ్యులను వెంటనే శిక్షించాలని తెలిపారు. అలాగే తాను సనాతన ధర్మానికి వ్యతిరేకిని కాదన్నారు
![]() |
![]() |