ట్రెండింగ్
Epaper    English    தமிழ்

22.02.2026 నుండీ 28.02.2026 వరకు ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు)

Astrology |  Suryaa Desk  | Published : Sun, Feb 22, 2026, 01:41 PM

మేషరాశి.... (అశ్విని 1 2 3 4,భరణి 1 2 3 4,కృతిక 1వ పాదం) (నామ నక్షత్రములు: చూ, చే ,చొ, లా,లీ, లూ, లే, లో,ఆ)వారం ప్రారంభం ఉత్సాహం గా ఉల్లాసంగా ప్రారంభిస్తారు. విద్యలో, వృత్తి లో ఆకస్మిక మార్పులతో అభివృద్ధి కొరకు కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. భాగస్వామ్య అంశాలు, ఆర్థిక, కుటుంబ విషయాలు కొన్ని ఆలస్యం అయినప్పటికీ చివరికి మంచి ఫలితాలే పొందగలుగుతారు. బద్ధకాన్ని అధిగమించాలి. స్నేహ సంబంధాల్ని, నెట్వర్క్ దూర ప్రదేశాలలో విస్తరిస్తారు. పెద్దలు, అనుభవజ్ఞులైన గురువుల సహకారంతో ముందుకువెళతారు. బంధువులతో అనుబంధాలు బలపడతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. కమ్యూనికేషన్ అనుకూలంగా ఉంటుంది. తక్కువ శ్రమతో అనుకున్న పలితాలు సాధిస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సామర్థ్యంతో, లక్ష్యాలని ఏర్పరచుకొని అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. వినాయకుని ఆరాధన మేలు.


వృషభరాశి...(కృతిక 2,3,4,రోహిణి 1 2 3 4,మృగశిర 1 2 పాదాలు) (నామ నక్షత్రములు:ఈ, ఊ, ఎ, ఓ, వా, వీ, వూ, వె, వో)  


ప్రారంభంలో ఆత్మీయులైన వ్యక్తుల కొరకు అధిక ఖర్చు చేస్తారు. రుణములు ఇచ్చే విషయంలో జాగ్రత్తలు అవసరం. ఘర్షణలను అధిగమించాలి. తండ్రి ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. దూర ప్రయాణాలకు అవకాశం. వృత్తి విషయాలలో శ్రమ ఒత్తిడి అధికంగా ఉంటాయి. తోబుట్టులతో వాతావరణం మిశ్రమంగా ఉంటుంది, తదుపరి కమ్యూనికేషన్ లో ఇబ్బందులు, ఆర్థిక విషయాలలో, కుటుంబానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. దూర ప్రదేశాలలో నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేయు వారికి శ్రమ అధికం అయినప్పటికీ ఉన్నత స్థాయి వ్యక్తుల సహకారం లభ్యం. మానసిక ప్రశాంతత అనుకూలం. స్థిర నిర్ణయాలు తీసుకుంటారు. సంఘంలో మాట విలువ గౌరవం పెరుగుతాయ. కుటుంబ వ్యవహారాలలో తీసుకుంటున్న నిర్ణయాలు అనుకూలం. దుర్గాదేవి ఆరాధన మేలు


మిధున రాశి...(మృగశిర 3 4,ఆరుద్ర 1 2 3 4,పునర్వసు 1,2,3 పాదాలు) (నామ నక్షత్రములు: కా, కి, కూ, ఖం , జ్ఞ, చ్చ, కే, కో, హ, హి)  


వారం ప్రారంభంలో కుటుంబం విషయాలు, ఆర్థిక సంబంధ అంశాలు, దూర ప్రదేశాల నుంచి వర్తమానాలు, మానసిక ప్రశాంతత, మాట విలువ, వినోదాలలో పాల్గొనడం చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. దూర ప్రదేశాలలో ఉన్న చిన్ననాటి మిత్రులతో స్నేహ సంబంధాలను పెంపొందించుకుంటారు. ఆకస్మిక వివాదాలకు, డ్రైవింగ్ విషయాలలో అననుకూలతల అవకాశం ఉన్నప్పటికీ తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్లాలి. సంతాన విషయాలలో ఉన్నత విద్య కొరకు, కుటుంబంలోని పెద్దలతో చర్చలు చేస్తారు. ఆకస్మిక ఖర్చులు అధికంగా ఉంటాయి. స్థిరాస్తుల పెట్టుబడులకై, రుణముల కొరకు ప్రయత్నాలు చేస్తారు. వృత్తిలో శ్రమ ఉన్నప్పటికీ కుటుంబంలో తల్లిదండ్రులు సౌకర్యాలు కొరకు ఆలోచిస్తారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో, వృత్తిలో అధికారులతో సమయానికి పనులను పూర్తి చేసుకుని అనవసర వాదములకు దూరంగా ఉండాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనమేలు.


కర్కాటక రాశి...(పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4 పాదాలు) (నామ నక్షత్రములు: హి, హూ, హే, హో, డా, డీ ,డూ, డే, డో)


వారం ప్రారంభంలో పెండింగులో ఉన్న వృత్తి పరమైన విషయాలు పట్టుదలతో పూర్తి చేస్తారు. అధిక శ్రమతో వృత్తిలో ఎదుర్కొంటున్న సమస్యలను గురించి, వ్యక్తిగత అభివృద్ధి కొరకు చేద్దాము అనుకుంటున్న మార్పుల అంశాలలో ప్రణాళికలు వేసుకుంటారు. దూర ప్రదేశాల నుంచి ఒక సమాచారం ఆనందాన్నిస్తుంది. గృహ వాహనాలకు సంబంధించి, స్థిరాస్తులంశాలలో, పూర్వపు నిర్ణయాలు అనుకూలతలు. మిత్రులతో కలయిక, ఇష్టమైన గృహోపకరణ వస్తువుల కొనుగోలు, ఆన్లైన్ వస్త్రముల షాపింగ్ వంటివి, భాగస్వామితో కలిసి సమయాన్ని సద్వినియోగ పరచుకోవడం చేస్తారు. ఇగో సమస్యలకు దూరంగా ఉండాలి. దూర ప్రాంతములలో ఉన్న గురువులతో విద్యా విషయాలలో చర్చలు జరుపుతారు. నిద్రలేమిని అధిగమించాలి. ఆరోగ్య విషయంలో ఖర్చులు, శ్రద్ధ అవసరం. దత్తాత్రేయుని ఆరాధన మేలు


సింహరాశి...(మఖ 1 2 3 4, పుబ్బ 1 2 3 4, ఉత్తర 1వ పాదం) (నామ నక్షత్రములు: మా, మీ, మూ, మే, మో, టా, టీ, టూ, టే)


ప్రారంభంలో వృత్తిపరమైన దూర ప్రయాణాలు , ఉన్నత విద్య, తండ్రి ఆరోగ్యం కొరకు ఖర్చులు చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో అధిక శ్రమతో మంచి ఫలితాలు సాధించడానికి తగిన ప్రణాళికతో కృషి చేస్తారు. కుటుంబంలోని స్త్రీలు, జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. వ్యాపార భాగస్వాములతో, ముఖ్యంగా దూర ప్రదేశాలలో వ్యాపార విస్తరణ కొరకు చేసే పెట్టుబడుల అంశాలలో ఘర్షణలకు తావివ్వరాదు. అసంతృప్తిని అధిగమించాలి. పూర్వపు పెట్టుబడుల మీద ఆదాయాన్ని అందుకునే అవకాశం ఉన్నప్పటికీ, కమ్యూనికేషన్ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్లాలి. మార్కెటింగ్, నెట్వర్క్, జర్నలిజం రంగాలలో వారు ఆచితూచి ముందుకు వెళ్లాలి. ఆత్మీయులతో ఆకస్మిక సమస్యలు ఎదురు అవుతున్నప్పటికీ వివేకంతో దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలరు. శివారాధన మేలు.


కన్యా రాశి...(ఉత్తరఫల్గుణి 2 3 4,హస్త 4,చిత్త 1 2 పాదాలు) (నామ నక్షత్రములు: టో,పా,పి,పూ,షం,ణా,పే,పో)


ప్రారంభంలో ముఖ్యమైన విషయాలలో ఆకస్మిక మార్పులు. కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఉద్వేగాలను అధిగమించాలి. పూర్వ స్థిరాస్తుల విషయంలో ఆత్మీయులతో చర్చలు. మానసిక ప్రశాంతత, ఆరోగ్య విషయంలో శ్రద్ధ, రోగనిరోధక శక్తిని పెంపొందించు కుంటారు, ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి ప్రయత్నాలు అనుకూలం, మిత్రులతో తోబుట్టువులతో సమావేశాలు. క్రీడాకారులకు అనుకూలం. ఆశించిన స్థాయిలో పెద్దల సహకారం లభ్యం అవ్వడం కష్టం అయినప్పటికీ సమయానికి సమయస్ఫూర్తితో మీ పనులు సాధించుకో గలుగుతారు. ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసేవారు, దూర ప్రయాణాలు మిశ్రమ ఫలితాలు. వృత్తి విషయంలో శ్రమ బాధ్యతలు పెరిగినప్పటికీ, గౌరవంతో పాటు ఎదురుచూస్తున్న విషయాలలో అనుకూలమైన ఫలితాలు పొందుతారు. హనుమాన్ మందిరాలు దర్శనం మేలు


తులా రాశి...(చిత్త 3 4,స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: రా, రి, రూ, రె, రో, తా, తీ, తూ, తే)    


వృత్తిపరంగా స్నేహ సంబంధాలను పెంపొందించు కోవడానికి ప్రయత్నాలు చేస్తారు. సంఘంలో గుర్తింపు గౌరవం, శ్రమకి తగిన ప్రతిఫలం అందుకుంటారు. వృత్తిపరంగా తీసుకున్న కీలక నిర్ణయాలు నూతన స్నేహాలని, సంఘంలో బాధ్యతలని పెంచుతుంది. గృహ, స్థిరాస్తులు అంశాలు, తల్లిఆరోగ్యం పై శ్రద్ధ. విద్యా అంశాల మీద విద్యార్థులు శ్రద్ధను పెంచుకోవాలి. ముఖ్యమైన విషయాలలో వాయిదాలు, వృత్తిపరమైన విషయాలలో ప్రత్యర్ధుల మీద విజయం కొరకు శ్రమ అధికం చేయడం వల్ల ఘర్షణత్మకమైన ఆలోచనలకు మానసిక, ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం.ఆందోళనను అధిగమించాలి. అనవసర విమర్శలకు దూరంగా ఉండాలి. దూర ప్రదేశాల్లో ఉన్న సంతానం యొక్క అభివృద్ధి కొరకు ఆలోచనలు. వాయిదాపడ్డ పనులు మంచివ్యక్తుల సహకారంతో ముందుకు వెళతాయి. వెంకటేశ్వర ఆరాధన మేలు.


వృశ్చిక రాశి...(విశాఖ 4,అనురాధ 1 2 3 4, జేష్ఠ 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: తో, నా, నీ, నూ, నె, నో, యా, యీ, యు)   


ప్రారంభంలో ఉన్నత విద్యా విషయాలు, రుణములు తీర్చే ప్రయత్నాలు, రోగ నిరోధక శక్తిలో, న్యాయపరమైన విషయాలలో అనుకూలతలు, తండ్రి గారి ఆరోగ్య శ్రద్ధ మొదలైన వాని పై దృష్టి. విద్యార్థులు శ్రమతో విజయం సాధించగలరు. సాంఘిక సంబంధాలు నూతన స్నేహ సంబంధాలు పెంపొందించు కుంటారు. స్థిరాస్తుల ,వాహన విషయాలలో ముఖ్యంగా డ్రైవింగ్ లో తగిన జాగ్రత్తలు అవసరం. గృహ వాతావరణం ప్రశాంతత తక్కువ. క్రింది పనిచేసే సిబ్బంది సహకారంలో అసౌకర్యాలు. భాగస్వామి, సంతానవర్గంతో వారి అవసరాల నిమిత్తం షాపింగులు ఖర్చులు అధికం. అనవసరమైన వాదనలకు, చర్చలకు ప్రాధాన్యత ఇవ్వకుండా దూరం మేలు. జీవిత భాగస్వామికి సంబంధించి వారి రంగాలలో గుర్తింపు, గౌరవం పెరుగుతుంది. వారాంతములో కుటుంబముకై , ఇతరులకు సహకరించే నిమిత్తం ఆకస్మిక ఖర్చులు. నవగ్రహ శ్లోకాలు మేలు.


ధను రాశి...(మూల 1 2 3 4,పూర్వాషాఢ 1 2 3 4,ఉత్తరాషాఢ 1వ పాదం) (నామ నక్షత్రములు: యే, యో, భా,భీ, భూ, ధ, ఫ, డా, భే)


ప్రారంభంలో సంతానవర్గం అభివృద్ధికి, దీర్ఘకాలిక పెట్టుబడునలకై ఆకస్మికంగా ఖర్చులు చేస్తారు. ముఖ్యముగా సంతానము ఆలోచనలు, స్నేహాలు, ఆరోగ్యము విషయాలలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. వారికి, మీకు ఆలోచనల సమన్వయంలో వైరుధ్యాల వల్ల ఘర్షణలకు అవకాశం ఉన్నప్పటికీ వాటిని అధిగమించే నేపథ్యంలో కొంత సమయమనం పాటించవలసిన పరిస్థితి గోచరిస్తోంది. తదుపరి నూతన శక్తితో, ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో, మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ధైర్యము పరాక్రమము పెరుగుతాయి. వృత్తిలో పలుకుబడి కలిగిన వ్యక్తుల యొక్క ఆలోచనలని స్వాగతిస్తారు. ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసిన వ్యక్తుల మీద నైపుణ్యాలతో విజయం సాధిస్తారు. గృహ నిర్మాణ నిమిత్తం రుణాలకి అవకాశం, ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యవహారాలలో తగిన జాగ్రత్తలు అవసరం. గౌరవం పలుకుబడి పెరుగుతాయి. అమ్మవారి ఆరాధన మేలు.


మకర రాశి...(ఉత్తరాషాఢ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ఠ 1 2 పాదాలు) (నామ నక్షత్రములు: భ,జా,జి,ఖి,ఖు,ఖే,ఖో,గా,గి)


జీవిత భాగస్వామి సహకారంతో గృహ, వాహన సంబంధ విషయాలలో నిర్ణయాలు. ఉత్సాహంగా చేపట్టిన కార్యక్రమాలలో సామర్థ్యాన్ని ఉపయోగించి ముఖ్యంగా స్థిరాస్తి సంబంధ అంశాలని పటిష్టం చేసుకుంటారు. ఆర్థిక సంబంధ విషయాలలో తల్లితో చర్చలు అనుకూలం. సంతానము అభివృద్ధి ఆలోచనలు అనుకూలం. వారి కొరకు దీర్ఘకాలిక పెట్టుబడులు విషయాలలో కొత్త వ్యక్తులు ను నమ్మి ముందుకు వెళ్లేటప్పుడు,నూతన నిర్ణయాలలో తగిన జాగ్రత్తలు అవసరం. ఉద్వేగ పూరితమైన ఆలోచనల కన్నా, వివేకవంతంగా నిర్ణయాలు మేలు. స్థిరాస్తులు అమ్మకాలు కొనుగోలు, ఆర్థిక విషయాలు, గవర్నమెంట్ సంబంధ అంశాలు లో ఆత్మీయుల సలహాతో ముందుకు వెళ్లాలి. శుభకార్యాలలో పాల్గొంటారు, మిత్రులతో మంచి సమయాన్ని సద్వినియోగ పరుచుకుంటారు. వారాంతంలో భాగస్వామి ఆరోగ్యం కోసం శ్రద్ధ తీసుకుంటారు. గణేశారాధన మేలు 


కుంభ రాశి...(ధనిష్ట 3 4, శతభిషం 1 2 3 4, పూర్వాభాద్ర 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: గూ, గే, గో, సా, సి, సు, సే, సో, దా)    


అధిక శ్రమతో ప్రత్యర్థుల మీద మీద విజయం సాధించడానికి పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించి అనుకున్న సమయంలో అనుకున్న పనిని పూర్తి చేయగలుగుతారు. ప్రణాళికలో లేని వృత్తిసంబంధ ప్రయాణాలు అధిక శ్రమను, అలసట ఒత్తిడి, నిద్రలేమి కలిగిస్తాయి. కొలీగ్స్ తో, పై అధికారులతో అనవసర వాదనలు అధిగమించి తగిన విశ్రాంతి, ఆహార స్వీకరణ, వ్యక్తిగత ఆరోగ్యం పై శ్రద్ధ తీసుకొని రోగ నిరోధక శక్తిని పెంపొందించుకొని ముందుకు వెళ్లడం వల్ల అనుకూల ఫలితాలు సాధించగలరు. తల్లిదండ్రుల సహకారం, ఆకర్షణ, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. కొత్త వాహనం కొనుగోలు కొరకు ప్రయత్నాలు, చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ముఖ్యంగా గణితం లో విజయ సాధన కొరకు శ్రమిస్తారు. సాంఘిక సంబంధాల విషయంలో, పలుకుబడి కలిగినవారి సహకారం, ఆధ్యాత్మిక వ్యక్తులు యొక్క ఆశీస్సులు మేలు చేస్తాయి. దుర్గాదేవి ఆరాధన మేలు.


మీన రాశి...(పూర్వాభాద్ర 4,ఉత్తరాభాద్ర 1 2 3 4,రేవతి 1 2 3 4 పాదాలు)(నామ నక్షత్రములు: దీ , దు, ఇ+, ఝ, ధా, దే, దో, చా, చి)


ప్రారంభంలో ఆలోచనలు, మాట విలువ, ఆర్థిక సంబంధాలు సంతానము కుటుంబముతో అనుకూలంగా ఉంటాయి నెట్వర్క్ పెరుగుతుంది. సోదరుల సహకారం బాగుంటుంది. తదుపరి దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు, ఇతరులకు రుణము ఇవ్వడం కోసం ఆకస్మిక నిర్ణయాల వల్ల, నూతన వ్యక్తుల జోక్యం వల్ల భాగస్వామ్య వ్యవహారాలలో ఘర్షణలకు అవకాశం ఉంది. కమ్యూనికేషన్ విషయంలో తగిన జాగ్రత్తలు అవసరం. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. వ్యవసాయ భూమిలో జాగ్రత్తలు, గృహ వాతావరణంలో అసౌక్యం సరిచూసుకుంటూ, స్త్రీలతో ఘర్షణలు అధిగమిస్తూ జాగ్రత్తగా ముందుకు వెళ్లాలి. వారాంతంలో ఆలోచనలు ఫలవంతముగా ఉన్నప్పటికీ, ఆలస్యాల వల్ల అవకాశాలు చేజారకుండా జాగ్రత్త వహించాలి. అనవసరమైన ప్రయాణాలు ఖర్చుల్ని అధిగమించాలి. విష్ణు సహస్రనామాలు మేలు. 


(గమనిక: గోచార రీత్యా చెప్తున్న రాశి ఫలితాలు జనరల్ వి, వ్యక్తిగతంగా ఉద్దేశించి చెబుతున్నవి కావు, వ్యక్తిగత జన్మజాతకంలో అనగా వ్యక్తి జన్మ కుండలి (జన్మించిన సమయం, తేదీ, ప్రదేశం ఆధారంగా నిర్మించేది) ప్రకారం నడిచే దశలు అంతర్దశలు ప్రధానంగా చూసుకుంటూ ఆ దశ అంతర్దశలకు సంబంధించిన దానికి తగిన పరిహారాలు పాటించుకుంటూ, దానితో పాటు ఈ గోచార ఫలితాలను చూసుకోవాలి. గోచార రీత్యా రాశి ఫలాలు అశుభము గా ఉండి దోషాలు ఉన్నప్పటికీ, జననకాల దశ ఫలములు శుభము గా ఉంటే రాశి ప్రస్తుత అశుభ ఫలితాలు స్వల్పంగానే ఉంటాయి. చిన్న చిన్న పరిహారాలు పాటించి శుభ ఫలితాలు పొందగలరు).


 


 


డా|| ఈడ్పుగంటి పద్మజారాణి / Dr Edupuganti Padmaja Rani


జ్యోతిష్యము & వాస్తు నిపుణురాలు / Astrology & Vaastu Consultant


email : padma.suryapaper@gmail.com


www.padmamukhi.com






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa