PPF లబ్దిదారులకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ భారీ ఊరటనిచ్చారు. PPFలో నామినీ మార్పునకు ఛార్జీలుండవని ప్రకటించారు. PPFలో నామినీల వివరాలను మార్చడానికి ఆర్థిక సంస్థలు రుసుం వసూలు చేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. వాటిని తొలగించడానికి జీవో తీసుకొచ్చామని 'X'లో పోస్టు చేశారు. ఇటీవల ఆమోదం పొందిన బ్యాంకింగ్ సవరణ బిల్లు నలుగురు నామినీలను చేర్చుకునేందుకు వీలు కల్పిస్తోందని స్పష్టం చేశారు.
![]() |
![]() |