ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జుట్టు బాగా పెరగాలంటే నూనె ఎలా, ఏ టైమ్‌లో రాయాలో తెలుసా

Life style |  Suryaa Desk  | Published : Tue, Apr 08, 2025, 11:06 PM

జుట్టు సంరక్షణలో నూనె పట్టించడం ఎంతో ముఖ్యమైనది. నూనెలు సహజంగానే తేమని అందిస్తాయి. నూనె రాయడం వల్ల జుట్టు డ్రైగా కాకుండా జుట్టు మూలాల నుండి బలంగా మారుతాయి. జుట్టు మూలాలకి పోషణని అందించి జుట్టు పెరుగుదలకి పోషకాలను అందిస్తుంది.


దుమ్ము, కాలుష్యం కారణంగా మన జుట్టు పొడిగా, నిర్జీవంగా మారుతుంది. అంతేకాకుండా.. తెల్ల జుట్టు, తలపై వెంట్రుకలు రాలిపోవడం వంటి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఉరుకుల పరుగుల జీవితం, పొల్యూషన్, మనం తినే ఆహారం కారణగా చిన్న వయసులోనే చాలా మంది జుట్టు సమస్యలతో సతమతమవుతున్నారు. ఇక, ప్రతి ఒక్కరికి తమ జుట్టంటే చాలా ఇష్టం. జుట్టు అందంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఒత్తైన, మెరిసే, పొడవైన కేశాలు ఉండాలని ప్రతి ఒక్కరూ ఆశపడుతుంటారు. కానీ, అందరికీ జుట్టు ఒకేలా ఉండకపోవచ్చు. అయితే, జుట్టుకు నూనె రాయకపోవడంతో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి.


జుట్టు సంరక్షణలో నూనె పట్టించడం ఎంతో ముఖ్యమైనది. నూనెలు సహజంగానే తేమని అందిస్తాయి. నూనె రాయడం వల్ల జుట్టు డ్రైగా కాకుండా జుట్టు మూలాల నుండి బలంగా మారుతాయి. జుట్టు మూలాలకి పోషణని అందించి జుట్టు పెరుగుదలకి పోషకాలను అందిస్తుంది. అయితే, సరైన పద్ధతిలో అప్లై చేయకపోతే అది జుట్టుపై అంతగా ప్రభావం చూపదు. జుట్టుకు సరిగ్గా నూనె అప్లై చేయకపోతే చాలా సమస్యలు వస్తాయి. అంతేకాకుండా సరైన సమయంలో జుట్టుకు నూనె అప్లై చేయడం కూడా చాలా ముఖ్యం. జుట్టుకు ఏ సమయంలో నూనె అప్లై చేయాలి? ఆయిల్ రాయడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.


 తలస్నానానికి ముందు జుట్టుకు ఆయిల్ అప్లై చేయడం మంచిదని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. తలస్నానం చేయడానికి కనీసం ఒక గంట ముందు నూనె రాయాలని నిపుణులు సూచిస్తున్నాయి. ఇలా చేయడం వల్ల జుట్టు కుదుళ్లకు తగిన పోషణ అంది అనేక ప్రయోజనాలు ఉంటాయని అంటున్నారు. అంతేకాకుండా జుట్టు రాలే సమస్యను ఆపి.. బాగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా పొడి జుట్టు, నిర్జీవమైన జుట్టు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.


ఏ నూనె అయినా సరే జిడ్డుగా, తేమగా ఉంటాయి. అందుకే ఎక్కువ సేపు జుట్టుకు నూనె ఉంచుకోవడం మంచి కాదంటున్నారు నిపుణులు. తల, జుట్టు జిడ్డుగా ఉండటం వల్ల మురికి, మలినాలు ఎక్కువగా పేరుకుపోతాయి. దీంతో జుట్టు ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే జుట్టుకు నూనెను తరచుగా రాసుకోకూడదంటున్నారు నిపుణులు. వారానికి ఒకటి లేదా రెండు సార్లు రాసుకుంటే సరిపోతుందని నిపుణుల అభిప్రాయం.


నూనె ఎలా అప్లై చేయాలి?


ఏదో రాశామంటే సరిపోదు. నూనెను చాలా మంది జుట్టుకు మాత్రమే పటిస్తారు. ఇదే చాలా మంది చేసే తప్పు. నూనెను తలకు మర్ధన చేయాలి. తలకు పట్టించడం వల్ల జుట్టు ఆరోగ్యం బలపడుతుంది. అంతేకాకుండా నూనె అప్లై చేసిన తర్వాత చేతి వేళ్లతో బాగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. జుట్టు కుదళ్ల నుంచి చివర్ల వరకు నూనె అప్లై చేయాలి. అప్పుడే జుట్టు చివర్లు కూడా స్ట్రాంగ్ అవుతాయి. నూనె అప్లై చేయడం వల్ల కలిగే ప్రయోజనాలపై ఓ లుక్కేద్దాం.


చుండ్రు తొలగిపోతుంది


జుట్టుకు క్రమం తప్పకుండా నూనె రాయడం వల్ల చుండ్రుతో పాటు తలలో దురద తొలగిపోతుంది. నూనెలో వేప ఆకులు వేసి వేడి చేసి, స్నానం చేసే ముందు తలకు బాగా పట్టించాలి. దీని తర్వాత జుట్టును గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల చుండ్రు సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. చుండ్రు సమస్యతో ఎక్కువ బాధపడేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అంటున్నారు నిపుణులు.


తలనొప్పి నుంచి రిలీఫ్


మీకు తలనొప్పి సమస్య ఉంటే జుట్టుకు ఏదైనా ఆయుర్వేద నూనె రాయండి. వీలైతే, ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించిన తర్వాత నూనెను వాడండి. ఆయుర్వేదం ప్రకారం, తలనొప్పి వాతానికి సంబంధించినది. కాబట్టి, సాయంత్రం 6 గంటలకు జుట్టుకు నూనె రాయాలి. వాతాన్ని తొలగించడానికి ఈ సమయం మంచిది.


మంచి నిద్ర కోసం


రాత్రి పడుకునే అరగంట ముందు జుట్టుకు నూనె రాసి సున్నితంగా మసాజ్ చేయడం వల్ల మంచి నిద్ర వస్తుంది. నిద్రలేమి సమస్యలతో బాధపడేవారికి ఇది మంచి ఆప్షన్ అంటున్నారు నిపుణులు. కొబ్బరి నూనెను అరచేతిపై రుద్దడం ద్వారా లేదా వేడి చేయడం ద్వారా కూడా జుట్టుకు అప్లై చేయవచ్చు. ఆయుర్వేదంలో జుట్టుకు నూనెకు చాలా ప్రాముఖ్యత ఉంది. అందువల్ల, జుట్టు సంబంధిత సమస్యలను నివారించడానికి సమయానికి నూనె రాయడం చాలా అవసరం.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com