వినుకొండ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో గురువారం 2 నూతన బస్సులను ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. కొత్త బస్సులు అందుబాటులోకి రావడంతో ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జున రావు ఆర్టీసీ అధికారులు, సిబ్బంది మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
![]() |
![]() |