కర్నూలు నుండి రాజధాని అమరావతికి చేరుకునేందుకు కీలకమైన కర్నూలు దోర్నాల 131 కిలోమీటర్ల దూరం 340 సీ జాతీయ రహదారిని నాలుగు వరుసలుగా విస్తరణ చేసి పనులు జరుగుతున్నాయి. శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు నుంచి ప్రకాశం జిల్లా దోర్నాల మధ్యలోని నల్లమల అరణ్యం లో ఘాట్ రోడ్డు నిర్మాణం పనులు వేగవంతం చేయాలని కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరిని నంద్యాల ఎంపీ శబరి కోరారు. గురువారం ఢిల్లీలో వినతి పత్రం అందించారు.
![]() |
![]() |