ఉచిత టికెట్ల కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్సీఏ వేధిస్తోందని ఆరోపించినట్టు.ఈ వేధింపులు ఇలాగే కొనసాగితే హైదరాబాద్ విడిచి వెళ్లడానికి తమ ఫ్రాంఛైజీ సిద్ధంగా ఉందని సన్ రైజర్స్ హైదరాబాద్ స్పష్టం చేసినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్తలపై హెచ్సీఏ స్పందించింది. ఆ వార్తల్లో నిజం లేదని పేర్కొంటూ ఒక ప్రకటనను విడుదల చేసింది. తమకు సన్ రైజర్స్ హైదరాబాద్ ఎలాంటి ఈమెయిల్స్ రాయలేదని తెలిపింది. ఒకవేళ నిజంగానే ఈమెయిల్స్ వచ్చి ఉంటే ఈ సమాచారాన్ని హెచ్సీఏ లేదా సన్ రైజర్స్ అధికారిక ఈమెయిల్స్ నుంచి కాకుండా గుర్తు తెలియని ఈమెయిల్స్ నుంచి లీక్ చేయడం ఏమిటని ప్రశ్నించింది. ఈ ఈమెయిల్స్ నిజమైనవా కాదా అనే విషయం తెలుసుకోవడానికి తమ నుంచి కూడా మీడియా వివరణ తీసుకోవాలని సూచించింది. తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దని కోరింది.
![]() |
![]() |