భారత నౌకాదళంలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. ఇండియన్ నేవీ తాజాగా అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అగ్నివీర్ మెట్రిక్ రిక్రూట్, అగ్నివీర్ ఎస్ఎస్ఆర్, అగ్నివీర్ ఎస్ఎస్ఆర్ మెడికల్ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ నెల 29 ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ వచ్చే నెల 10వ తేదీతో ముగుస్తుంది. దరఖాస్తు చేసే పోస్టును బట్టి పదో తరగతి, ఇంటర్ కనీసం 50 శాతం మార్కులతో పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులు.రూ.550 అప్లికేషన్ ఫీజు చెల్లించి నేవీ అధికారిక వెబ్‌సైట్ https://www.joinindiannavy.gov.in/ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ పరీక్ష, రాత పరీక్ష, ఫిజికల్ ఈవెంట్లు, మెడికల్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఐఎన్ఎస్ చిల్కాలో అధికారులు శిక్షణ ఇస్తారు. శిక్షణ విజయవంతంగా పూర్తిచేసుకున్న తర్వాత అభ్యర్థులు నాలుగేళ్ల పాటు నేవీలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
![]() |
![]() |