ధర్మవరం హైస్కూల్ మైదానంలో ఈనెల 6 నుంచి 15వ తేదీ వరకు రాష్ట్రస్థాయి జూనియర్ బాలుర ఛాంపియన్ షిప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు హాకీ అసోసియేషన్ సెక్రటరీ సూర్యప్రకాష్ గురువారం పేర్కొన్నారు.
దివంగత వ్యాయామ ఉపాధ్యాయులు నారాయణ జ్ఞాపకార్ధం ఈ పోటీలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి 22 జట్లు పాల్గొంటాయని అన్నారు. ప్రతిభ కనబరిచే క్రీడాకారులను జాతీయ పోటీలకు ఎంపిక చేసినట్లు తెలిపారు.
![]() |
![]() |