వర్షాలు పడుతున్న సమయంలో పర్యావరణంలోని తేమ పెరగడంతో నీళ్లు కలుషితమవుతాయి. కాబట్టి తాగే నీటి విషయంలో జాగ్రత్త వహించాలి. వాతావరణం మారడంతో జలుబు, దగ్గు, ఎలర్జీలకు అవకాశం ఉంది. అందువల్ల వేడి నీటిని తాగడం మంచిది. దోమల వల్ల జ్వరాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇంట్లోకి దోమలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పండ్లు, కూరగాయలను ఉప్పు నీటితో శుభ్రంగా కడిగి తినాలి. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి.
![]() |
![]() |