బీజేపీ మాజీ చీఫ్ సోము వీర్రాజు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన సంగతి తెలిసిందే.ఎమ్మెల్సీ అయిన తర్వాత వీర్రాజు తొలిసారి రాజమండ్రికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు బీజేపీ శ్రేణుల నుంచి ఘన స్వాగతం లభించింది. తనకు మంత్రి కావాలనే కోరిక లేదని మంత్రి కావాలని అనుకుంటే 2014లోనే అయ్యేవాడినని చెప్పారు.ఈ జీవితానికి ఇది చాలని అన్నారు. ఏపీలో కూటమిలో బీజేపీ కలవడం వెనుక రాజకీయ వ్యూహం ఉందని చెప్పారు. త్వరలో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.దేశంలో దమ్మున్న మగాడు ప్రధాని మోదీ అని సోము వీర్రాజు కితాబునిచ్చారు.
![]() |
![]() |