ప్రస్తుతం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వం 250కి పైగా సేవలు అందిస్తోంది. జూన్ నాటికి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 500 రకాల సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.ఈ విధానాన్ని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం సంకల్పించింది.గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ఎలా పొందాలనే విషయమై ప్రజలకు వివరించనున్నారు. వారు ప్రజల మొబైల్ ఫోన్ లో 955230009 నెంబరును 'మన మిత్ర' పేరిట సేవ్ చేయనున్నారు.
![]() |
![]() |