డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్ లపై డోజ్ సారథి, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తొలిసారి స్పందించినట్లు తెలుస్తోంది. చైనా విషయంలో టారిఫ్ యుద్ధాన్ని ఆపాలని, ఈ విషయంలో కాస్త తగ్గితేనే మేలని ట్రంప్ కు సూచించారని సమాచారం. ఇటీవల ట్రంప్ తో జరిగిన భేటీలో మస్క్ ఈ అభిప్రాయాన్ని వెలిబుచ్చినట్లు తెలిసింది. అయితే, ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. ఈ మేరకు పలు ఆంగ్ల మీడియాలు కథనాలు వెల్లడిస్తున్నాయి. ఈ కథనాల ప్రకారం.. డొనాల్డ్ ట్రంప్‌తో మస్క్ నేరుగా చర్చలు జరిపారు. చైనాపై టారిఫ్ లు విధించే విషయంలో మరోమారు ఆలోచించాలని కోరారు. దీనికి ట్రంప్ నిరాకరించారని, టారిఫ్ ల విషయంలో తగ్గేదేలేదని ఖరాఖండిగా చెప్పినట్లు సమాచారం.
![]() |
![]() |