బాపట్ల నియోజకవర్గ పరిధిలోని అర్హులైన ఆరుగురు లబ్ధిదారులకు గురువారం తెదేపా కార్యాలయం వద్ద ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ సీఎం సహాయనిధి చెక్కులను అందించారు. అనంతరం ఎమ్మెల్యే వేగేశన మాట్లాడుతూ సీఎం సహాయ నిధి చెక్కులను సద్వినియోగం చేసుకొని ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. అనంతరం సీఎం సహాయనిధి చెక్కులను అందించిన ఎమ్మెల్యేకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.
![]() |
![]() |