అనంతపురం శ్రీనివాస్ నగర్‌లోని సీతారామాంజనేయ దేవస్థానంలో ఈ నెల 6న శ్రీరామ నవమిని పురస్కరించుకుని గురువారం సీతారామ కళ్యాణం ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త ఆళ్లగడ్డ రాము మాట్లాడుతూ, సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసిన ఆలయ కమిటీ సభ్యులు, భక్తుల సహకారంతో అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఉదయం సుప్రభాత సేవ నుంచీ రాత్రి పవళింపు సేవ వరకు అన్ని కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు.
![]() |
![]() |