ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు తలపడనున్న చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్

sports |  Suryaa Desk  | Published : Tue, Apr 08, 2025, 07:27 PM

ఐపీఎల్ లో ఇవాళ రెండు మ్యాచ్ లు నిర్వహిస్తున్నారు. రెండో మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. ఈ 'కింగ్స్' పోరులో  టాస్ గెలిచిన పంజాబ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ఛండీగఢ్ లో జరుగుతోంది. ఈ మ్యాచ్ కోసం పంజాబ్ కింగ్స్ ఎలాంటి మార్పులు లేకుండా బరిలో దిగుతుండగా... సీఎస్కే కూడా గత మ్యాచ్ లో ఆడిన జట్టునే బరిలో దింపుతోంది. రికార్డు స్థాయిలో ఐదు ఐపీఎల్ టైటిళ్లు నెగ్గిన చెన్నై జట్టు ఈ సీజన్ లో దారుణంగా ఆడుతోంది. ఇప్పటిదాకా 4 మ్యాచ్ లు ఆడి ఒక్కదాంట్లోనే గెలిచింది. అందుకే ఇవాళ్టి మ్యాచ్ ను చావోరేవో అన్నట్టుగా తీసుకుని బరిలో దిగుతోంది. మరోవైపు శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలోని పంజాబ్ కింగ్స్ 3 మ్యాచ్ లు ఆడి రెండింట్లో గెలిచి మాంచి ఊపు మీదుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com