ఆంధ్రప్రదేశ్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేశ్ తన ముంబై పర్యటనలో భాగంగా ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏపీ అభివృద్ధిపై లోకేశ్ దార్శనికతను సంజయ్ దత్ ప్రశంసించారు. రాష్ట్రానికి తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.ముంబై పర్యటనలో ఉన్న మంత్రి లోకేశ్, పలువురు పారిశ్రామికవేత్తలతో, ప్రముఖులతో భేటీ అవుతున్నారు. ఇందులో భాగంగానే ఆయన సంజయ్ దత్‌ను కలిశారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌లో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఉన్న అవకాశాలు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి లోకేశ్ తన ఆలోచనలను పంచుకున్నారు.లోకేశ్ వివరించిన అంశాలపై సంజయ్ దత్ సానుకూలంగా స్పందించారు. లోకేశ్ గారు, మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం మీకున్న విజన్, స్పష్టత నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మీకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది అని సంజయ్ దత్ పేర్కొన్నారు. రాష్ట్రానికి సినీ పరిశ్రమను ఆకర్షించే లక్ష్యంతో లోకేశ్ జరుపుతున్న ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa