IND vs WI: టీమిండియా యువ క్రికెటర్, స్టార్ ఫినిషర్ Rinku Singh కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రింకూ సింగ్ తండ్రి ఖాన్చంద్ సింగ్ (63) కన్నుమూశారు. కొంతకాలంగా ప్రాణాంతక క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన ఆరోగ్యం ఇటీవల విషమించడంతో శుక్రవారం (ఫిబ్రవరి 27, 2026) తెల్లవారుజామున 4.36 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ వార్త తెలిసిన వెంటనే క్రికెట్ వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. రింకూను ఈ స్థాయికి తీసుకురావడంలో ఆయన తండ్రి చేసిన కష్టాలు, త్యాగాలను అభిమానులు గుర్తుచేసుకుంటున్నారు.గత కొన్ని వారాలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఖాన్చంద్ సింగ్‌ను చికిత్స నిమిత్తం గ్రేటర్ నోయిడాలోని Yatharth Hospitalలో చేర్చారు. ఇటీవల మ్యాచ్ ముగిసిన తర్వాత రింకూ సింగ్ తండ్రిని పరామర్శించి తిరిగి జట్టుతో కలిశారు. అయితే శుక్రవారం ఉదయం వైద్యులు ఆయన మరణాన్ని ధృవీకరించారు. సమాచారం అందుకున్న వెంటనే రింకూ సింగ్ చెన్నై నుంచి ఉదయం 5 గంటలకు ఢిల్లీకి విమానంలో బయలుదేరి, అక్కడి నుంచి నేరుగా ఆసుపత్రికి చేరుకుని తండ్రికి కడసారి నివాళులు అర్పించారు.ఈ విషాద ఘటనపై బీసీసీఐ సెక్రటరీ Devajit Saikia సంతాపం వ్యక్తం చేస్తూ, ఈ క్లిష్ట సమయంలో బోర్డు రింకూకు అండగా ఉంటుందని తెలిపారు. వ్యక్తిగత కారణాల వల్ల మార్చి 1న వెస్టిండీస్‌తో జరగనున్న సూపర్-8 మ్యాచ్‌కు రింకూ అందుబాటులో ఉండరని స్పష్టం చేశారు. కుటుంబంతో గడపాలని నిర్ణయించుకున్న ఆయన జట్టుతో కలిసి కోల్‌కతాకు ప్రయాణం చేయడం లేదు.టీ20 ప్రపంచకప్ 2026లో భారత్‌కు ఇది కీలక దశ. మార్చి 1న కోల్‌కతాలోని Eden Gardensలో వెస్టిండీస్‌తో జరగబోయే మ్యాచ్ భారత్‌కు అత్యంత కీలకం. సెమీఫైనల్ అవకాశాలను నిలబెట్టుకోవాలంటే ఈ మ్యాచ్‌లో గెలుపు తప్పనిసరి. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న రింకూ సింగ్ గైర్హాజరు జట్టుకు గణనీయమైన లోటుగా భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఆయన స్థానంలో తుది జట్టులోకి ఎవరికి అవకాశం దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది. మాజీ క్రికెటర్లు, సహచర ఆటగాళ్లు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేస్తూ, సాధారణ సిలిండర్ డెలివరీ ఉద్యోగిగా పనిచేస్తూ కుమారుడిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన తండ్రి కృషిని ప్రశంసిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa