ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పీపీఎఫ్ ఖాతా ఒకటి కంటే ఎక్కువ తెరవలేరు!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 27, 2026, 08:28 PM

ప్రభుత్వం ప్రజల కోసం అనేక పొదుపు పథకాలను అమలు చేస్తోంది. అందులో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) ఒకటి. దీని ద్వారా అధిక ఆదాయంతో పాటు పన్ను ప్రయోజనాలు కూడా లభిస్తాయి. అయితే, పీపీఎఫ్ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి పేరుపై ఒకే ఒక్క ఖాతా తెరవడానికి అనుమతి ఉంది. ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు తెరిస్తే, రెండో ఖాతా చెల్లదు. పాన్ నంబర్‌తో లింక్ అయి ఉండటం వల్ల రెండో ఖాతా ఆటోమేటిక్‌గా తెలిసిపోతుంది. మైనర్లకు కూడా ఖాతా తెరవొచ్చు, కానీ 18 ఏళ్లు వచ్చే వరకు సంరక్షకుడి ఆధ్వర్యంలో నిర్వహించాలి. ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.500 నుంచి గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. 15 ఏళ్ల మెచ్యూరిటీ తర్వాత వడ్డీతో సహా మొత్తం పొందవచ్చు. ప్రస్తుతం పీపీఎఫ్ వడ్డీ రేటు 7.1% ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa