నేటి డిజిటల్ యుగంలో UPI (Unified Payments Interface) లావాదేవీలు విపరీతంగా పెరిగినప్పటికీ, ఇప్పటికీ చాలా మంది నగదు (Cash) ఆధారిత లావాదేవీలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. అయితే మీ పొదుపు ఖాతాలో (Savings Account) ఎప్పుడు పడితే అప్పుడు పెద్ద మొత్తంలో నగదు జమ చేయడం సమస్యలకు దారి తీసే అవకాశం ఉంది. అక్రమ నగదు ప్రవాహాన్ని నియంత్రించేందుకు ఆదాయపు పన్ను శాఖ కఠిన నిబంధనలను అమలు చేస్తోంది.ఒక ఆర్థిక సంవత్సరంలో మీ సేవింగ్స్ ఖాతాలో నగదు డిపాజిట్లు రూ.10 లక్షలు దాటితే, బ్యాంకులు ఆ వివరాలను Annual Information Return (AIR) ద్వారా ఆదాయపు పన్ను శాఖకు తెలియజేస్తాయి. మీరు ఆదాయానికి సరిపోని విధంగా పెద్ద మొత్తంలో నగదు జమ చేస్తే Income Tax Department నుంచి నోటీసులు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మీరు సక్రమంగా ITR ఫైల్ చేస్తూ, మీ ఆదాయ వనరులు స్పష్టంగా చూపిస్తే ఎంత మొత్తంలోనైనా డిపాజిట్ చేయవచ్చు.బ్యాంకింగ్ నిబంధనల ప్రకారం, ఒకేసారి రూ.50,000 లేదా అంతకంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేయాలంటే తప్పనిసరిగా PAN కార్డ్ వివరాలు సమర్పించాలి. ఈ పరిమితి ఒక్క ఖాతాకే కాకుండా, ఒకే బ్యాంకులో ఉన్న అన్ని ఖాతాల డిపాజిట్ల మొత్తం మీద కూడా వర్తిస్తుంది.ఒకవేళ ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేస్తే, ఆ నగదు ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయానికి సంబంధించిన సరైన ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. తగిన పత్రాలు లేకపోతే ఆ మొత్తంపై పన్నుతో పాటు జరిమానా కూడా విధించే అవకాశం ఉంటుంది.నిపుణుల సూచనల ప్రకారం, పెద్ద మొత్తంలో నగదు లావాదేవీల కంటే UPI, NEFT, RTGS వంటి డిజిటల్ చెల్లింపులను ఉపయోగించడం ఉత్తమం. ఇవి పూర్తిగా ట్రేస్ చేయగలిగే విధంగా ఉండటం వల్ల భవిష్యత్తులో ఎలాంటి ఆర్థిక లేదా చట్టపరమైన సమస్యలు వచ్చినా సులభంగా వివరణ ఇవ్వవచ్చు. ఆర్థిక లావాదేవీలను పారదర్శకంగా ఉంచుకోవడం ద్వారా అనవసరమైన ఇబ్బందులను నివారించవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa