గుత్తి మున్సిపాలిటీ కేంద్రంలోని ఆర్ఎస్ రోడ్డులో శ్రీ సాయి డిగ్రీ కళాశాల ఎదురుగా ఉన్న ఫంక్షన్ హాల్ యజమాని నాగరాజు బకాయి పడ్డ రూ. 5. 22 లక్షలు చెల్లించనందున గత నెల 27న మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు.
ఈ క్రమంలో గురువారం ఫంక్షన్ హాల్ యజమాని నాగరాజు రూ. 1. 50 లక్షల ట్యాక్స్ చెల్లించారు. మిగిలిన అమౌంట్ ఇన్స్టాల్మెంట్ ప్రకారం చెల్లిస్తానని హామీ ఇచ్చారు. దీంతో కమిషనర్ జబ్బర్ మియా ఫంక్షన్ హాల్ ఓపెన్ చేయించారు.
![]() |
![]() |