తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు నేడు ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబును కలిశారు. ఉగాది పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ తో పాటు వచ్చిన వేద పండితులు సీఎం చంద్రబాబుకు వేదాశీర్వచనాలు పలికారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు ముఖ్యమంత్రికిశాలువా కప్పి, శ్రీవారి ప్రసాదాలు అందజేశారు. తిరుమలలో భక్తులకు అందుతున్న సేవలపై టీటీడీ చైర్మన్ ను అడిగి చంద్రబాబు వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కడప జిల్లా ఒంటిమిట్ట క్షేత్రంలో నిర్వహించే రాములవారి కల్యాణ మహోత్సవానికి రావాలంటూ చంద్రబాబును ఆహ్వానించారు. ఈ మేరకు టీటీడీ చైర్మన్ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 11న కల్యాణోత్సవం జరగనుంది.
![]() |
![]() |